Tragic Incident In Kamareddy: కైట్ ఎగరవేస్తూ భవనంపై నుంచి పడి బాలుడి మృతి
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:19 PM
కాామారెడ్డి జిల్లాలో ఓ బాలుడు కైట్ ఎగరవేస్తూ భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మరణించాడు.
కామారెడ్డి, జనవరి 20: కైట్ ఎగరవేస్తూ.. భవనంపై నుంచి కిందపడి కార్తీక్ అనే 12 ఏళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో చోటు చేసుకుంది.
కార్తీక్.. సోమవారం తమ రెండస్తుల భవనంపై గాలిపటం ఎగరవేస్తున్నాడు. ఆ క్రమంలో భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో.. మెరుగైన వైద్య చికిత్స కోసం తక్షణమే హైదరాబాద్‌కు తరలించాలని కార్తీక్ తల్లిదండ్రులకు స్పష్టం చేశారు అక్కడి వైద్యులు. దీంతో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చదవండి:
యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు