KamaReddy: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించేందుకు యత్నించి..
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:40 AM
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కొల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డిలో జరిగింది.
కామారెడ్డి, జనవరి 01: న్యూ ఇయర్ వేళ.. పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు కారు ఆపినా.. ఆగకుండా అధిక వేగంగా వెళ్లి ఒక యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డిలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న గోపు నరేశ్ (30) ఈ విషయాన్ని గుర్తించాడు. అతడి వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. కానీ కారు వేగాన్ని పెంచి ముందుకు దూసుకు వెళ్లాడు.
ఆ వేగంతో సమీపంలోని బండరాయికి వెళ్లి కారు బలంగా ఢీ కొట్టాడు. దీంతో కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న గోపు నరేశ్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు వెంటనే స్పందించి .. కారులోని అతడిని బయటకు తీశారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌గా పోలీసులు గుర్తించారు. నరేశ్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..
For More TG News And Telugu News