Share News

ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టిన గంజాయి స్మగ్లర్లు..

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:06 AM

నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా.. ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి చేసింది. కారును ఆపి తనిఖీ చేయాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సహా ఇతర సిబ్బంది ప్రయత్నించగా, స్మగ్లర్లు కారును వేగంగా నడిపి పోలీస్ సిబ్బందిని ఢీకొట్టారు.

ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టిన గంజాయి స్మగ్లర్లు..
Nizamabad ganja case

నిజామాబాద్, జనవరి 14: జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా.. ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి చేసింది. మాధవనగర్ ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తున్న కారును ఆపి తనిఖీ చేయాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సహా ఇతర సిబ్బంది ప్రయత్నించగా.. స్మగ్లర్లు కారును వేగంగా నడిపి పోలీస్ సిబ్బందిని ఢీకొట్టారు.


ఈ దాడిలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు వాహనాన్ని వెంబడించి, కారును ఆపి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన వారని గుర్తించారు పోలీసులు. గంజాయి గ్యాంగ్ పారిపోతున్న కారు స్తంభానికి ఢీకొనడంతో వారు చివరికి పోలీసులకు చిక్కారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ఏజెంటిక్‌ ఏఐలో కొలువులే కొలువులు

మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..

Updated Date - Jan 24 , 2026 | 12:29 PM