నిజాం కాలం నాటి సర్వేలతో క్షేత్రస్థాయిలో నెలకొన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాలోని 17 మండలాల్లో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు.
కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మూ డు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా అధికారులు మూడు నెలల కోటా రేషన్ పంపిణీకి సన్నాహాలు ప్రారంభిచారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే విడతలో లబ్ధిదారులకు అందించేందు కు అవసమైన నిల్వ లు, రవాణా, పంపిణీకి పౌరసరఫరాల శాఖ కార్యాచరణ చేపట్టింది.
దేశంలో సూపర్ ఎల్‌నినో ఉందని, ఇప్పటికే వర్షాభావ పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చే సేలా అధికారులు అవగాహన కల్పించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధి, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ప్రభుత్వ బడుల ఆధునికీకరణలో భాగంగా డిజిటల్ తరగతులు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది.
నల్లగొండ జిల్లాలో వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
నల్లగొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కొంతకాలంగా నిందితులిద్దరూ చిన్నారిని బెదిరించి లైంగిక దాడికి తెగబడుతున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చగా.. నిందితులపై పోక్సో కేసు నమోదు అయ్యింది.
పట్టణంలోని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకుని, వాన నీటిని సంరక్షించుకోవాలని చౌటుప్పల్ మునిసిపల్ చైర్‌పర్సన మొగుదా ల పావని రమేష్ గౌడ్ కోరారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో వానాకాల ప్రారంభంలో రెండు, మూడు భారీ వర్షాలు కురియడంతో ముందస్తు దుక్కులు దున్నుకున్న రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు.