Share News

మద్యం మత్తులో వృద్ధురాలిపై లైంగిక దాడి

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:37 AM

వరుసకు మనుమడైన యువకుడు ఓవృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మద్యం మత్తులో  వృద్ధురాలిపై లైంగిక దాడి

మర్రిగూడ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): వరుసకు మనుమడైన యువకుడు ఓవృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మర్రిగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు(65) ఒంటరిగా నివసిస్తోంది. భర్త మృతిచెందగా, ఆమె కుమారుడు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. వరుసకు మనుమడైన అదే గ్రామానికి చెందిన నక్క శివ (21) మద్యం మత్తులో ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో వృద్ధురాలి ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న ఆమెను లేపి నోట్లో వస్త్రం కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత వృద్ధురాలు గురువారం స్థానికులతో కలిసి గురువారం పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి నిందితుడు శిను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - Feb 13 , 2026 | 12:37 AM