చైర్మన రేసులో ముగ్గురు
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:36 AM
హుజూర్‌నగర్ మునిసిపల్ చైర్మన అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రం కావడంతో ఇక్కడి మునిసిపల్ చైర్మన పదవిపై పలువురు ఆసక్తితో ఉ న్నారు.
ఎటూ తేల్చని అధిష్ఠానం
(ఆంధ్రజ్యోతి - హుజూర్‌నగర్)
హుజూర్‌నగర్ మునిసిపల్ చైర్మన అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రం కావడంతో ఇక్కడి మునిసిపల్ చైర్మన పదవిపై పలువురు ఆసక్తితో ఉ న్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ధీమాలో ఉన్నారు. నియోజకవర్గ కేంద్రం కావడంతో మునిసిపల్ చైర్మన పదవి కీలకం కానుంది. పట్టణంలో 28 వార్డులకు 3వ వార్డు కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవంగా కాగా 27 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బుధవారం జరిగిన ఓటింగ్ సరళిపై కాంగ్రెస్ అధిష్ఠానం సమీక్ష చేసింది. సుదీర్ఘ కాలంగా పార్టీలో పనిచేసిన వారికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. చైర్మన రేసులో పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు, దొంతగాని శ్రీనివాసు, జక్కుల మల్లయ్య ఉన్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా టీపీసీసీ డెలిగేట్ సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ రాష్ట్రకార్యదర్శి యరగాని నాగన్న చైర్మన పదవి ఆశించగా అధిష్ఠానం సూచనలతో వెనక్కి తగ్గారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. కౌంటింగ్ అనంతరం గెలిచిన కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో 2019 మునిసిపల్ ఎన్నికలలో చైర్మన అభ్యర్థిని ముందుగానే ప్రకటించారు. కానీ 2026 ఎన్నికలకు సంబంధించి సస్పెన్షన్‌లో ఉంచారు. దీంతో పలువురు అభ్యర్థులు చైర్మన పదవి ఆశిస్తుండడంపై ఉత్కంఠత ఏర్పడింది.