పత్తి కొనుగోలు సందర్భంగా రైతులకు ఇబ్బంది కలిగించే కఠిన నిబంధనలను సీసీఐ వెంటనే ఎత్తి వేయాలని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.
: చౌటుప్పల్ పట్టణంలోని ఊర చెరువు అలుగు నీరు సజావుగా ముందుకు వెళ్లేందుకు గాను శాశ్వత పరిష్కారం కోసం ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు మునిసిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్రెడ్డి, ఐబీ ఎస్ఈ జి.శ్రీనివా్సరెడ్డి తెలిపారు.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కమీషనదారులు, గుమస్తాలు, దడవాయిలు తూకాల దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతులు, మిల్లర్లను మోసం చేసి తప్పుడు తూకాలు చూపించిన కొంతమంది కమీషనదారులు, గుమస్తాలు, దడవాయిలు పర్సంటేజీల పరంగా పంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వందేళ్లు పూర్తి చేసుకున్న ఓ వృద్ధుడిని గ్రామాభివృద్ధి కమిటీ సన్మానించింది. ఆయన జన్మదినాన్ని వేడుకగా జరిపించారు.
రామన్నపేట నుంచి కొమ్మాయిగూడెం, సిరిపురం వెళ్లే దారిలో ఉన్న రైల్వే అండర్పా్సలో నిలిచిపోయిన వాననీటిని వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య రైల్వే అధికారులను డిమాండ్ చేశారు.
వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చౌటుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ భవనాలు వరద నీటిలో మునిగి పోయాయి. లక్కారం చెరువు నుంచి ప్రవహిస్తున్న అలుగు నీరు ఈ భవనాలలోకి చేరుకుంది.
మొంథా తుఫాన ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలతో బిక్కేరు వాగుకు వరద పెరిగింది.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హుజూర్నగర్లో గురువారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించి ఏర్పాటుచేసిన యాదాద్రిభువనగిరి తుర్కపల్లి మండలం రామోజీనాయక్తండా ప్రాథమిక పాఠశాల నిరూపయోగంగా మారింది.