Share News

నేటి నుంచి యాదగిరీశుడి బ్రహ్మోత్సవం

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:44 AM

భువనగిరి-రాయిగిరి ఈ రెండింటికి ఎదుట యాదగిరి.. కనురెప్ప కొట్టకుండా కనిపెట్టి చూడు.. కనిపించే ఆ దేవుడే యాదగిరి నరసన్న.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదగిరిగుట్ట పంచనారసింహుల వార్షిక బ్రహోత్సవాలు రానే వచ్చాయి.

నేటి నుంచి యాదగిరీశుడి బ్రహ్మోత్సవం

సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబు

ఉత్సవ వాహనాలు సిద్ధం

24న ఎదుర్కోళ్లు, 25న కల్యాణోత్సవం

26న దివ్య విమాన రథోత్సవం

(ఆంధ్రజ్యోతి,యాదగిరిగుట్ట) : భువనగిరి-రాయిగిరి ఈ రెండింటికి ఎదుట యాదగిరి.. కనురెప్ప కొట్టకుండా కనిపెట్టి చూడు.. కనిపించే ఆ దేవుడే యాదగిరి నరసన్న.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదగిరిగుట్ట పంచనారసింహుల వార్షిక బ్రహోత్సవాలు రానే వచ్చాయి. భక్తుల కల్పతరువుగా నిలుస్తున్న లక్ష్మీనృసింహుడి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల కు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు కొనసాగనుండగా, వీటి విజయవంతానికి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచేగాక దేశ, విదేశాలకు చెందిన భక్తులు స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు.

యాదగిరి నృసింహుడి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భా గంగా ఆలయ ఉత్తర తిరువీధిలో యాగశాలను సిద్ధం చే యగా పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించిన ఆలయాన్ని విద్యుత్‌ దీపాలు, వివిధరకాల పుష్పాలతో సర్వాంగసుందరంగా ము స్తాబు చేశారు.దివ్యక్షేత్రం పూర్తిగా విద్యుత్‌ కాంతుల్లో రాత్రి వేళ ఇలా వైకుంఠపురంగా భక్తులను కనువిందు చేస్తోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.2కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు దేవస్థాన ఈవో జే.భవానీశంకర్‌ తెలిపారు.

తిరుకల్యాణ టికెట్టు రూ.3వేలు

స్వామివారి తిరు కల్యాణోత్సవానికి రూ.3వేలు చెల్లించి టికెట్‌ పొందిన దంపతులు, ఇద్దరు పిల్లలతో కలిసి సంప్రదాయ దుస్తులతో పాల్గొనేందుకు అధికారులు అనుమతిసా ్తరు. ఉత్సవాలు వేదమంత్రోచ్ఛారణ, ఆస్థాన విద్వాంసులు, మంగళవాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వానాలతో చూడముచ్చటగా కొనసాగనున్నాయి. పాంచరాత్ర ఆగమశాస్త్ర సంప్రదాయ రీతిలో జరిగే ఈ వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో అలంకార సేవలు, వాహన సేవలు భక్తుల ను విశేషంగా అలరించనున్నాయి. 100 మంది రుత్వికులు, పారాయణీకులు, పండితులు, ప్రధానార్చకులు ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తారు. వేదపండితులు చతుర్వేద పారాయణాలతో పాటు నిత్య హోమం నిర్వహిస్తారు. స్వామివారి వాహన సేవకు బంగారు తాపడంతో ఉన్న హనుమంత, గజ, గరుడ, శేష వాహనాలను సిద్ధం చేశారు.

అలంకార, వాహన సేవలు

దివ్యక్షేత్రంలో 18వ తేదీ ఉదయం నుంచి బ్రహ్మోత్సవ వైభవం సంతరించుకోనుంది. స్వస్తివాచనం, రక్షాబంధనం తో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు రాత్రి మృత్సంగ్రహ ణం, అంకురారోపణ, 19న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, హవనం, 20 నుంచి 26వ తేదీ వర కు ఏడు అవతారాలు, ఆరు వాహన సేవల్లో స్వామివారు కనువిందు చేయనున్నారు. ఉదయం మత్స్యావతార అలంకారం,వేద పారాయణాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ, 21న వటపత్రశాయి అలంకారం, రాత్రి హంసవాహన సేవ, 22న శ్రీ కృష్ణాలంకారం (మురళీకృష్ణుడు), రాత్రి పొన్నవాహన సేవ, 23న గోవర్ధనగిరిధారి అలంకారం, సింహవాహన సేవ, 24న జగన్మోహిని అలంకా రం,ఆశ్వవాహన సేవలో ఎదుర్కోళ్లోత్సవం, 25న శ్రీరామ అ లంకారం, హనుమంత వాహన సేవ, గజవాహన సేవలో తిరు కల్యాణమహోత్సవం, 26న శ్రీ మహావిష్ణువు అలంకా రం,గరుడ వాహన సేవ,దివ్య విమాన రథోత్సవం, 27న మ హా పూర్ణాహుతి,చక్రతీర్థం,విష్ణుపుష్కరిణీలో అవబృత స్నా నం, రాత్రి శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, దోపోత్సవం, 28నఅష్టోత్తరశతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.

విద్యుత్‌ దీపాలు.. స్వాగత తోరణాలు

విద్యుత్‌ కాంతులతో దివ్యక్షేత్రం ఇలా వైకుంఠపురాన్ని తలపిస్తోంది. కొండపైన ఆలయం బంగారు వర్ణం కొండ పరిసరాలు, కొండకింద వైకుంఠద్వారం నుంచి విరజిమ్మే వీధి దీపాలతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. జిల్లా కేంద్ర భువనగిరి, యాదాద్రి కలెక్టరేట్‌, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, యాదగిరిపల్లి ప్రధాన కూడళ్ల వద్ద భారీ స్వాగత తోరణాలు సిద్ధం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో బ్రిడ్జికి ఇరువైపులా (ప్రధాన రహదారి వెంట) నెమలి ఈక, పిల్లలగ్రోవి, వెన్నకుండ అకారాలతో మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాలతో 14 తాత్కాలిక స్తంభాలను దేవస్థానం సివిల్‌ విభాగం ఈఈ జిల్లెల దయాకర్‌రెడ్డి పర్యవేక్షణలో అందంగా తీర్చిదిద్దారు. కొండపైన భక్తుల కోసం మూడు చోట్ల మరుగుదొడ్లు అందుబాటులో ఉండగా, తాగునీటిఇ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తిరువీధుల్లో చలువ పందిళ్లు, కొండపైన స్వాగత తోరణం కుడివైపు, ప్రోటోకాల్‌ కార్యాలయం పక్కన ఏనుగు, రథానికి రంగులు పూర్తిచేయాల్సి ఉంది.

20 నుంచి సంగీత సభలు

స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తజనులను ఆధ్యాత్మిక ఆనంద రస డోలికల్లో తేలియాడించే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 27 వరకు ఏడు రోజుల పాటు కళాతోరణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందిన వివిధ రంగాల కళాకారులు పాల్గొననున్నారు. వైదిక ప్రార్థన, మంగళవాద్యం, భజనలు, భక్తి సంగీతం, హరికథ, సంగీత విభావరి, సంకీర్తనలు, శాస్త్రీయ నృత్యాలు, ధార్మిక ఉపన్యాసాలు, పౌరాణిక నాటక ప్రదర్శనలు, చిందు యక్షగానాలు, వేణుగానం, వీణవాద్యం, కర్ణాటక సంగీతం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు

యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు. నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన హోమం, సాయంత్రం జోడు సేవలు, 24 నుంచి 26 వరకు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తిరువారాధన, ఆరగింపు, బలిహరణ నిర్వహించనున్నారు. సాయంత్రం సహస్రనామార్చనలు, భోగాలు, 27న ఏకాదశి లక్షపుష్పార్చన మినహా 28వ తేదీ వరకు ఉదయం పూట అభిషేకాలు, అర్చనలు రద్దుచేసినట్టు ప్రకటించారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి : జే. భవానీశంకర్‌, ఆలయ ఈవో

స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఆలయం, స్వామి అలంకరణలు, భక్తులకు సౌకర్యాల కల్పనకు సుమారు రూ.2కోట్ల బడ్జెట్‌ కేటాయించాం. అలంకార, వాహన సేవలు, వాటి విశిష్టతను భక్తులకు తెలిసేలా పండితులు వివరిస్తారు. సంగీత, సాహిత్య, ధార్మిక సభలతో భక్తులకు ఆధ్యాత్మిక చింతన పెలంపొందిస్తాం.

Updated Date - Feb 18 , 2026 | 12:44 AM