సమన్వయ లోపం.. సాగు భారం
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:42 AM
సాగుకు సరిపడా యూరియా అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. వానాకాలం సీజనలో ఎదుర్కొ న్న ఇబ్బందులను యాసంగిలో అధిగమించడానికి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల్లో ఒక్కో రైతుకు పుస్తకాలు అందజేశారు.
సాగుకు సరిపడా యూరియా అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. వానాకాలం సీజనలో ఎదుర్కొ న్న ఇబ్బందులను యాసంగిలో అధిగమించడానికి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల్లో ఒక్కో రైతుకు పుస్తకాలు అందజేశారు. రైతులు రెండు రోజుల పాటు తిరిగి పుస్తకా లు సంపాదించిన తర్వాత ఆనలైనలో యూరియా బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆనలైనలో బుక్ చేసుకోవడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. అయినా కొందరికి యూరి యా దొరకలేదు. దొడ్డి దారిన కొందరికి యూరియా అందుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటు వ్యవసాయాధికారులు, అటు సహకార సం ఘాల మధ్య సమన్వయ లోపం రైతులకు ఇబ్బందిగా మారింది.
- (ఆంధ్రజ్యోతి-భానుపురి)
యాసంగి సీజన గత ఏడాది అక్టోబరు 15 నుంచి ప్రా రంభమైంది. అయితే అప్పటి నుంచే యూరియా కొరత ఉంటుందోన్న ఆలోచనతో రైతులు ఎరువుల దుకాణాలకు పరుగులుపెట్టారు. జిల్లాలో జిల్లాలో 4.80లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నట్లు అధికారులు అంచనాలువేశారు. దీని కి తగ్గట్టుగా 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవస రం అవుతోందని నివేదికలు తయారుచేశారు. అయితే యూరియా కోసం ఎరువుల దుకాణాలకు వస్తే కాంప్లె క్స్ ఎరువులను, పురుగుల మందులను, జింక్ లాంటి ఇతర మందులను వ్యాపారులు అంటగట్టినా రైతులు భరించారు.
అధికారుల పర్యవేక్షణ లోపం
యూరియా పంపిణీలో వ్యవసాయశాఖ, సహకారశాఖ ల అధికారుల నడుమ సమన్వయ లోపంతో రైతులు నష్టపోతున్నారు. యూరియా కొరత లేకుండా ఇతర జిల్లాల నుంచి రైతులు తీసుకువెళ్లకుండా ఉండడానికే జిల్లాను యూనిట్‌గా చేశారు. కొన్నిచోట్ల నియోజకవర్గాలను యూ నిట్‌గా, మండలాలను యూనిట్‌గా మార్చినా రైతుకు యూరియా దొరకని పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల పెనపహాడ్ మండలంలోని ఓ పీఏసీఎ్‌సలో అధికారి పాస్‌వర్డ్‌ను ఓపెన చేసి లారీ యూరియాను ఒక్క నిమిషంలో మాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆందోళన చేశారు. అక్కడ ఉన్న సిబ్బందిలో అధికారికి అనుకూలంగా ఉండే కొందరు సమయానికి ముం దు నుంచే యూరియా కోసం ఎదురు చూశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మండల స్థాయి అధికారి పాస్‌వర్డ్ చోరీ చేసి ఓపెన చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అవసరాలకు మించి కొందరు రైతులు యూరియాను నిల్వ చేసుకోవడంతోనే సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ఆందోళనలు చేస్తున్నారు. యూరియాను అవసరానికి మించి రైతులు వాడుతున్నారని చెబుతున్నారే తప్ప క్షేత్రస్తాయిలో... ఎక్కడా కూడా వ్యవసాయశాఖ అధికారులు పొలాల వద్దకు వెళ్లి అవగాహన కల్పించడం లేదని విమర్శిస్తున్నారు. కేంద్రం నుంచి యూరియా సరఫరా లేదన్న వంకతో రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ప్రతి మండలంలోని వ్యవసాయాధికారి వారంలో 10 దుకాణాలను, ఏడీఏ 10 దుకాణాలు, డీఏవో 5 దుకాణాల చొప్పున తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 716టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, మొత్తంగా ఇప్పటి వరకు 62 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాగా 8 వేల మెట్రిక్‌టన్నుల యూరియా ఇంకా జిల్లాకు రావల్సిందని అధికారులు చెబుతున్నారు.
పొట్ట దశకు పొలాలు వచ్చాయి..
జిల్లాలో వరి పొలాలు పొట్టదశకు చేరుకున్నాయి. జిల్లాలో యూరియా కొరత లేదు. పెనపహాడ్‌లో సీఈవో నిర్లక్ష్యంతో యూరియాకు ఇబ్బంది కలిగింది. రైతులు ఆందోళన చేయడంతో మరో లారీ యూరి యా తీసుకెళ్లి పంపిణీ చేశారు. పెనపహాడ్ మండలంలోని సంఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాల ని సహకార శాఖ అధికారులకు ఆదేశించాం.
- శ్రీధర్‌రెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి, సూర్యాపేట