దంపతులను బలిగొన్న మద్యం మత్తు
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:40 AM
లారీ డ్రైవర్ మద్యం మత్తు దంపతుల ప్రాణాలను తీసింది. మంగళవారం నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. హాలియా సీఐ సతీ్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ డ్రైవర్
హాలియా, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): లారీ డ్రైవర్ మద్యం మత్తు దంపతుల ప్రాణాలను తీసింది. మంగళవారం నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. హాలియా సీఐ సతీ్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల వెంకటయ్య(55), అనుముల మండల కొట్టాల గ్రామానికి చెందిన పిట్టల మల్లమ్మ(45) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, అందరికీ వివాహాలు చేశారు. మంగళవారం దంపతులిద్దరూ బట్టుగూడెం శివాలయానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై మల్లమ్మ తల్లి గారి గ్రామం కొట్టాలకు బయలుదేరారు. మార్గమధ్యలో హాలియాలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై ఉన్న వంతెన వద్దకు రాగానే పెదవూర నుంచి హాలియా వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సీఐ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, లారీని హాలియా పోలీస్ స్టేషనకు తరలించారు. వెంకటయ్య పెద్ద కుమార్తె మేకల కోటేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా సీఐ సతీ్‌షరెడ్డి తెలిపారు.