Share News

శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:34 AM

మండలంలోని వెల్లంకిలో ఈనెల 23, 24వ తేదీల్లో నిర్వహించే సీపీఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.

 శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి
కరపత్రం విడుదల చేస్తున్న సీపీఎం నాయకులు పెంటయ్య, వెంకటేశం తదితరులు

రామన్నపేట, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెల్లంకిలో ఈనెల 23, 24వ తేదీల్లో నిర్వహించే సీపీఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల నాయకులతో కలిసి శిక్షణ తరగతుల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సీపీఎం కార్యకర్తల్లో సైద్ధాంతిక, రాజకీయ అవగాహన పెంచేందుకు 200 మందితో రెండు రోజుల పాటు వెల్లంకి గ్రామంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఉద్యమిస్తున్నామన్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చి, నూతన భవనం నిర్మించి డాక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ధ్వంసమై ప్రమాదకరంగా మారిన రోడ్లను వెంటనే నూతన రోడ్లుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్‌, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరెళ్ల నర్సింహాచారి, బోయిని ఆనంద్‌, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్‌, జంపాల అండాలు, మండల కమిటీ సభ్యులు బావండ్లపల్లి బాలరాజు పలువురు ఉన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:34 AM