కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని చచ్చే వరకు వేధిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మన్నే క్రిశాంక్‌ని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని ధ్వజమెత్తారు.
మెదక్ జిల్లా శివ్వంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిది వోల్ట్‌ల బ్యాటరీ పేలిపోయి శివతేజ అనే బాలుడి చేతి వేళ్లు తెగిపోయాయి.
గత కొద్ది రోజులుగా రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో రైతులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మద్దతు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రం బతుకుతోందని చేవెళ్ల ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిధుల లేవని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని బీజేపీ ఎంపీ స్పష్టం చేశారు.
రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేటఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చారణా చేసి.. బారనా ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఘర్షణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కండక్టర్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రూ.20 వేలు లంచం అడిగినట్లు ఇన్‌స్పెక్టర్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టడం సంచలనం రేపింది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించిన వ్యక్తితో పాటు కండక్టర్‌ను ఆర్టీసీ అధికారి లంచం అడగటంతో ఈ ఘటన జరిగింది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఆస్తి పన్ను తగ్గించడానికి బిల్లు కలెక్టర్ ఒక వ్యక్తి నుంచి రూ.35 వేలు లంచం డిమాండ్ చేశాడు.