బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..
ABN , Publish Date - May 03 , 2026 | 04:59 PM
మెదక్ జిల్లా శివ్వంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిది వోల్ట్‌ల బ్యాటరీ పేలిపోయి శివతేజ అనే బాలుడి చేతి వేళ్లు తెగిపోయాయి.
మెదక్: బాలుడి చేతిలో బ్యాటరీ పేలి వేళ్లు తెగిపడిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. శివ్వంపేటకు చెందిన నాలుగో తరగతి విద్యార్థి శివతేజ తొమ్మిది వోల్ట్‌ల బ్యాటరీతో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో దాన్ని ఛార్జ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, బ్యాటరీ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో శివతేజ ఎడమ చేతి వేళ్లు తెగిపడ్డాయి. ఆ చేయి దాదాపు ఛిద్రమైనట్లు తెలుస్తోంది.
చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, బాలుడి పరిస్థితిపై వైద్యులు ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. చిన్న పిల్లలకు ప్రమాదకరమైన వస్తువులు ఇవ్వకూడదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్, ఛార్జర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు