Share News

కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 03 , 2026 | 04:04 PM

నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్, మే 03: నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఆయన ప్రకటించారు. పసుపు రైతులకు మంచి మద్దతు ధర లభిస్తోందంటే దానికి కారణం ప్రధాని మోదీ మాత్రమేనని స్పష్టం చేశారు.


‘కేసీఆర్‌కు మతిభ్రమించింది. నమ్మిన నాయకులను మోసం చేయడం ఆయనకు అలవాటు. బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డిని కూడా కేసీఆర్ మోసం చేస్తారు, కేసీఆర్ శకం ముగిసిపోయింది. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ స్థాయిలో మత్తు పదార్థాలను సరఫరా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు లేదు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా మరచిపోయారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను వారం రోజుల్లోగా కొనుగోలు చేయాలని బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. సరైన సమయంలో కొనుగోళ్లు జరగకపోతే రాష్ట్రంలో రైతాంగం నుంచి పెద్దఎత్తున ఉద్యమం వస్తుంది’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి

నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

For More TG News And Telugu News

Updated Date - May 03 , 2026 | 04:37 PM