Share News

శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి

ABN , Publish Date - May 03 , 2026 | 12:34 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సరఫరా చేసిన రసాయనాల నెయ్యికి ఆ నలుగురిదే బాధ్యత అని పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. దినేశ్ కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా అదే స్పష్టం చేసిందన్నారు.

శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి

తిరుపతి, మే 03: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సరఫరా చేసిన రసాయనాల నెయ్యికి ఆ నలుగురిదే బాధ్యత అని పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. దినేశ్ కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఆదివారం తిరుపతిలోని ప్రెస్ క్లబ్‌లో భానుప్రకాశ్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, వైవీ సుబ్బారెడ్డి, ఏవీ ధర్మారెడ్డితోపాటు భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర కీలకమని కమిషన్ తేల్చిందన్నారు. నిబంధనలు సడలింపు వలనే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు. మే 6వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేస్తామని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.


జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి సిట్ అందజేసింది. శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇచ్చిన నివేదికపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.


సీఎం జోక్యం చేసుకోవాలి: టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు

మరోవైపు టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ ఆదివారం తిరుపతిలో మాట్లాడుతూ.. గత రెండేళ్లలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పెరిగిందేమీ లేదని పెదవి విరిచారు. తిరుమల లడ్డులో జీడిపప్పు, ద్రాక్ష, కలకండ, యాలికలు వంటి ఆహార పదార్థాలు కనిపించడం లేదన్నారు. 165 గ్రాముల లడ్డులో దిట్టం ఎక్కడుందంటూ ఆయన ప్రశ్నించారు. పాలకమండలి సభ్యుడుగా పని చేసిన తాను లడ్డును ఇలా ఎగ్జిబ్యూట్ చేసి చూపించడం చాలా బాధగా ఉందన్నారు.


దినేశ్ కుమార్ వన్‌మెన్ కమిషన్ కూడా కొనుగోళ్ళలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిపిందని గుర్తు చేశారు. నాణ్యమైన ముడి సరుకులు కొనుగోలు చేయాలని వన్ మెన్ కమిషన్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తుల సెంటిమెంట్‌కు సంబంధించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఇకనైనా జోక్యం చేసుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు ఓవీ రమణ సూచించారు. .


ఈ వార్తలు కూడా చదవండి..

చిట్టీల పేరుతో భారీ మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

For More TG News And Telugu News

Updated Date - May 03 , 2026 | 12:50 PM