చిట్టీల పేరుతో భారీ మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ABN , Publish Date - May 03 , 2026 | 10:29 AM
హైదరాబాద్‌లో చిట్‌ఫండ్స్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. భారీగా నగదు పోవడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారంతా పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్, మే 03: మహానగరంలో చిట్‌ఫండ్స్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. భారీగా నగదు పోవడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారంతా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని మీర్‌పేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానిక వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేశ్ కుమార్, అతడి భార్య వెంకట సాయి చిట్‌ఫండ్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత పదేళ్లుగా వీరు చిట్టీలు నిర్వహిస్తూ, ప్రజల నుంచి భారీగా ఈ దంపతులు నగదు సేకరించారు.
ఒక్కొక్కరు నుంచి రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదు వసూల్ చేశారు. కొన్ని నెలల క్రితం చిట్టీల గడువు ముగిసింది. నగదు చెల్లించాలంటూ వారంతా సురేశ్ దంపతులను కోరారు. నిర్వాహకులు మాత్రం వారికి నగదు చెల్లించడం లేదు. చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తున్నారు. తమకు రావాల్సిన నగదు ఇవ్వాలంటూ వారిని నిలదీశారు. దీంతో దంపతులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అంతేకాకుండా.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బాధితులంతా మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వారు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ..
నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
For More TG News And Telugu News