Share News

జగిత్యాల వజరైవాడలో ఉద్రిక్తతలు.. మృతదేహం చుట్టూ ఆస్తి వివాదం

ABN , Publish Date - May 03 , 2026 | 03:28 PM

జగిత్యాల జిల్లా వజరైవాడలో ఆస్తి వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అనారోగ్యంతో మాధురి అనే మహిళ మృతి చెందగా.. ఆమె మృతదేహాన్ని కేంద్రంగా చేసుకుని కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల వజరైవాడలో ఉద్రిక్తతలు.. మృతదేహం చుట్టూ ఆస్తి వివాదం
Vajraivada incident

జగిత్యాల, మే 03: వజరైవాడలో ఆస్తి వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అనారోగ్యంతో మాధురి అనే మహిళ మృతి చెందగా.. ఆమె మృతదేహాన్ని కేంద్రంగా చేసుకుని కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మృతురాలి భర్త రాజు మూడేళ్ల క్రితమే మరణించగా.. ప్రస్తుతం ఆస్తి విషయంలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. మాధురి అత్త.. ఆస్తిని కుమారుడు రాజ్‌కు కాకుండా తన అడబిడ్డలకు ఇస్తానని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.


ఇంతలో కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలోనే బొంద తవ్వి మాధురి మృతదేహాన్ని అక్కడే పూడ్చేందుకు యత్నించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దీనికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి

నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

For More TG News And Telugu News

Updated Date - May 03 , 2026 | 04:04 PM