Share News

ఏసీబీకి చిక్కిన బిల్లు కలెక్టర్.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ముగిసిన సోదాలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:31 PM

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఆస్తి పన్ను తగ్గించడానికి బిల్లు కలెక్టర్ ఒక వ్యక్తి నుంచి రూ.35 వేలు లంచం డిమాండ్ చేశాడు.

ఏసీబీకి చిక్కిన బిల్లు కలెక్టర్.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ముగిసిన సోదాలు

సంగారెడ్డి, ఏప్రిల్ 30: జిల్లాలోని సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఆస్తి పన్ను తగ్గించడానికి బిల్లు కలెక్టర్ ఒక వ్యక్తి నుంచి రూ.35 వేలు లంచం డిమాండ్ చేశాడు. అప్పటికే బాధితుడి నుంచి రూ. 20 వేలు తీసుకున్నాడు. మిగిలిన నగదు కూడా ఇవ్వాలంటూ బాధితుడిపై నిఖిల్ రెడ్డి ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. గురువారం రూ.15 వేలు బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నిఖిల్ రెడ్డి చిక్కాడు.


అనంతరం సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో గురువారం సోదాలు చేపట్టారు. దాదాపు 4 గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. నిఖిల్ రెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయంలో నిఖిల్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడని డీఎస్పీ తెలిపారు


ఈ వార్తలు కూడా చదవండి..

పదవ తరగతి ఫలితాలు విడుదల.. స్పందించిన సీఎం చంద్రబాబు

అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు: విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ

Read Latest TG News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 08:38 PM