పదవ తరగతి ఫలితాలు విడుదల.. స్పందించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 30 , 2026 | 06:36 PM
రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
అమరావతి, ఏప్రిల్ 30: రాష్ట్రంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం పదవ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. గతేడాది 81.1 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగిందన్నారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణతా శాతం 5.22 శాతం అధికంగా ఉండటం సంతోషకరమని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత.. ఈ ఏడాది 78.39 శాతానికి పెరగడం స్ఫూర్తిదాయకమని ఆయన వివరించారు.
విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల ప్రణాళికతో ఈ ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రశంసనీయమని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకు మంత్రి లోకేశ్‌తో సహా ఆ శాఖ అధికారులు, టీచర్లు, సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు. పిల్లల్లో నైతిక విలువల పెంపుతో పాటు సమగ్ర విద్యా వికాసానికి విద్యా శాఖ చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లోకేశ్ విజన్‌తో విద్యార్థుల భవిష్యత్తుకు పడిన బలమైన పునాది: పల్లా
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి పయ్యావుల
Read Latest AP News And Telugu News