Share News

లోకేశ్ విజన్‌తో విద్యార్థుల భవిష్యత్తుకు పడిన బలమైన పునాది: పల్లా

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:58 PM

విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విజన్, పక్కా ప్రణాళికతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

లోకేశ్ విజన్‌తో విద్యార్థుల భవిష్యత్తుకు పడిన బలమైన పునాది: పల్లా
AP TDP Chief Palla Srinivasa rao

అమరావతి, ఏప్రిల్ 30: విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విజన్, పక్కా ప్రణాళికతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీలో పదో తరగతి ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు స్పందించారు. మంత్రి నారా లోకేశ్ అమలు చేసిన 100 రోజుల ప్రణాళికతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.


పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం అభినందనీయమని ఏపీ టీడీపీ చీఫ్ చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరగడం విద్యా రంగంలో పురోగతికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు రావడంతోపాటు బాలికలు ముందుండటం శుభపరిణామం అని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీకి కేంద్రం భారీగా నిధులు.. స్పందించిన కేంద్ర మంత్రి

సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయండి: పార్థసారథి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 06:07 PM