Share News

సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయండి: పార్థసారథి

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:25 PM

ప్రతినెల ఒకటో తేదీన ఎంతో చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఒకటో తేదీన సెలవు అయితే.. 30, 31 తేదీల్లో పెన్షన్లను పంపిణీ చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.

సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయండి: పార్థసారథి
Minister Parthasarathi

కృష్ణా జిల్లా, ఏప్రిల్ 30: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1న పమిడిముక్కలలో పర్యటించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడిన మంత్రి.. సీఎం పర్యటన వివరాలను తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ, ప్రజా వేదిక, కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొననున్నట్లు చెప్పారు. ప్రతినెల ఒకటో తేదీన ఎంతో చిత్తశుద్ధితో సీఎం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. ఒకటో తేదీన సెలవు అయితే.. 30, 31 తేదీల్లో పెన్షన్లను పంపిణీ చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.


ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు బిజీ షెడ్యూల్లో కూడా సీఎం చంద్రబాబు ప్రతివారం రెండు మూడు గంటలు ప్రజాక్షేత్రానికి కేటాయిస్తున్నారని మంత్రి తెలిపారు. ఆర్టీజీఎస్ కార్యక్రమం ద్వారా ప్రజలు సంతృప్తి చెందుతున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడంలో అవినీతి జరుగుతుందా అన్న అంశాలను కూడా సీఎం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయాలని.. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని మంత్రి కొలుసు పార్థసారథి విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

పశుసంవర్ధక రంగంలోకి రండి.. యువతకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు

పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 02:06 PM