14 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసు.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:53 AM
14 ఏళ్ల బాలికకు సంబంధించి 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఎయిమ్స్ (AIIMS) వైద్యులు సుప్రీంకోర్టులో 'క్యూరేటివ్ పిటిషన్' దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: 14 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసుకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితులు గర్భం దాల్చినప్పుడు.. ఏ సమయంలోనైనా అబార్షన్ చేసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. 14 ఏళ్ల బాలికకు సంబంధించి 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఎయిమ్స్ (AIIMS) వైద్యులు సుప్రీంకోర్టులో 'క్యూరేటివ్ పిటిషన్' దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది.
గర్భం దాల్చిన ఈ దశలో(30 వారాలు) గర్భవిచ్ఛిత్తి చేస్తే.. భవిష్యత్తులో బాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఎయిమ్స్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కోర్టు స్పందిస్తూ.. వైద్యుల సూచనల నేపథ్యంలో.. తుది నిర్ణయాన్ని బాధితురాలు, ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. అత్యాచార బాధితులు గర్భం దాల్చినప్పుడు.. ఏ సమయంలోనైనా దానిని తొలగించుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.
ఇవి కూడా చదవండి
ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ
కోహినూర్‌ను భారత్‌కు తిరిగివ్వాలని బ్రిటన్ రాజును కోరుతా: న్యూయార్క్ మేయర్ మమ్దానీ