Share News

ఏపీకి కేంద్రం భారీగా నిధులు.. స్పందించిన కేంద్ర మంత్రి

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:36 PM

వికసిత భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (వీబీజీఆర్ఏఎం) కింద రూ.1192.16 కోట్ల నిధులను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నిధులు మంజూరు చేసింది.

ఏపీకి కేంద్రం భారీగా నిధులు.. స్పందించిన కేంద్ర మంత్రి
Central Minister Pemmasani ChandraSekhar

న్యూఢిల్లీ, ఏప్రిల్30: వికసిత భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (వీబీజీఆర్ఏఎం) కింద రూ.1192.16 కోట్ల నిధులను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల్లో మెటీరియల్ కంపోనెంట్‌కు రూ.1123.15 కోట్లు, అడ్మిన్ కంపోనెంట్‌కు రూ.69.01 కోట్లు వినియోగించనున్నారు.

ఈ నిధుల విడుదలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. గ్రామీణ ఉపాధి అవకాశాలు విస్తరించడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, వారి జీవనోపాధిని బలోపేతం చేస్తాయని మంత్రి పెమ్మసాని తెలిపారు.


గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కూలీలకు వేతనాలు నేరుగా చేరే విధంగా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి.. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిధుల వినియోగంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మంచి ఫలితాలు సాధిస్తాయన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తుందని ఆకాంక్షించారు. ప్రతి గ్రామానికి ఉపాధి అవకాశాలను అందిస్తుందన్నారు.


ఈ నిధులు గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పిస్తూ, సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని మంత్రి పెమ్మసాని తెలిపారు. మరోవైపు దీనదయాళ్‌ అంత్యోదయ యోజన (DAY), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (NRLM) పథకం కింద రూ.207 కోట్ల నిధులను ఏపీకి కేంద్రం బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) తీసుకు వచ్చింది. దీనిని ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల వికసిత భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (వీబీజీఆర్ఏఎం)గా ఆ పథకం పేరు మార్చిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు

సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయండి: పార్థసారథి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 04:28 PM