ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై రెవెన్యూ శాఖ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి ఉన్నతాధికారులు మర్కుక్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రికార్డుల తనిఖీలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లాలో 15 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్‌పీహెచ్‌ఎస్(ZPHS)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందిన కేసులో శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్ అరెస్టు అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు.. అతనిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మూడు రోజులపాటు భక్తితో కొలిచి, అంతకు మించిన ఉత్సాహంతో గణనాథుడిని సాగనంపేందుకు వెళ్లిన ఆ యువకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చెరువులో పడిపోయిన మిత్రుడిని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు.
మట్టి వినాయకుడిని పూజించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన మావోయిస్టు దండకారణ్య సభ్యురాలు కాశబోయిన స్వరూప గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీశారు.
కుటుంబకలహాలు తల్లీకొడుకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్తతో గొడవపడిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా, తల్లి మరణవార్త విని కొడుకు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నల ఆశలు సన్నగిల్లుతున్నాయి.