Share News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:33 PM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పాక్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పార్లమెంట్ సభ్యుడు ఘునందన్‌రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‏లకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత

- మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి

జిన్నారం(సంగారెడ్డి): కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగిపోయారని, బీజేపీతోనే దేశంలో అభివృద్ధి సాధ్యమని ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandhan Rao), ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు అన్నారు. జిన్నారం, అండూరు తదితర గ్రామాలలో బీజేపీ మున్సిపల్‌ అభ్యర్థుల తరుఫున మంగళవారం ఆయన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి ప్రచారం నిర్వహించారు.


zzzzzzzzzzzzz.jpgకాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‏లకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని పేర్కొన్నారు.


zzzzzzzzzzzzzz.jfif

ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

థియేట‌ర్ల‌పై.. సినిమాల దండ‌యాత్ర‌! తెలుగులోనే డ‌జ‌న్‌.. ఎలా చూడాల్రా నాయ‌నా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 04 , 2026 | 12:46 PM