Share News

మున్సిపల్ ఎన్నికలు.. తొలి రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..

ABN , Publish Date - Jan 28 , 2026 | 09:39 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి రోజు 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్ - 12, నర్సాపూర్ - 3, తూప్రాన్ - 4, రామాయంపేట- 7 నామినేషన్లు వచ్చాయి

మున్సిపల్ ఎన్నికలు.. తొలి రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..
Telangana municipal elections

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి రోజు 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్ - 12, నర్సాపూర్ - 3, తూప్రాన్ - 4, రామాయంపేట- 7 నామినేషన్లు వచ్చాయి. అలానే సంగారెడ్డి జిల్లా కూడా మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో తొలి రోజు(బుధవారం) 99 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందోలు-18, జోగిపేట - 18, జహీరాబాద్ - 4, సంగారెడ్డి - 25 , సదాశివపేట- 14, నారాయణఖేడ్ - 10, ఇస్నాపూర్- 10,ఇంద్రేశం- 6, జిన్నారం- 3, గుమ్మడిదల- 6, గడ్డపోతారం- 3 నామినేషన్లు అధికారులు స్వీకరించారు.


నిజామాబాద్​ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలతో పాటు నగరపాలక సంస్థలు 22 నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డిలో నాలుగు మున్సిపాలిటీలకు 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ మందకోడిగా సాగినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఫిబ్రవరి 30వ తేదీ నామినేషన్‌లకు తుది గడువు.


Also Read:

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి

Updated Date - Jan 28 , 2026 | 09:44 PM