మహిళలకు కాంగ్రెస్ సర్కార్ చీరలు పంపిణీ చేసే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ కేవలం ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో ఉన్న 40 లక్షల మంది మహిళకు మాత్రమే చీరలు ఇస్తున్నారని అన్నారు.
సింగూరు డ్యాంను అధ్యయన కమిటీ పరిశీలించింది. డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే విషయంలో ప్రత్యక్షంగా కమిటీ పరిశీలన చేసింది.
ప్రజల సొమ్ముల్ని నెల నెలా జీతాల రూపంలో పుష్కలంగా అందుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆ జనాలకే చుక్కలు చూపిస్తున్నారు. నెలకు ఠంచనుగా జీతాలు అందుకుంటూనే లంచాలు ఆశిస్తూ ప్రజలకు ముందు నవ్వులపాలవుతున్నారు.
మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధి జరిగేలా గోపాల మిత్రలు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కారును తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి.
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందుకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్సే కారణంగా తెలుస్తోంది.
పఠాన్‌చెరు పారిశ్రామికవాడ రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉందని.. పూర్తిగా జలమయం అయిందని మంత్రి పొన్నం తెలిపారు. రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నదని.. కొట్టకుపోయిందని అన్నారు.