Share News

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:20 AM

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన.. అని అన్నారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాష్‏రెడ్డి. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను సంగారెడ్డిలో ఓడిపోవడం చాలా బాధేసిందన్నారు.

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన

  • నీకు లక్ష రూపాయలు సాయం చేసిన

  • సదాశివపేటలో నిమ్మ సోడా అమ్మే మహిళతో చెప్పిన జగ్గారెడ్డి

  • ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తక్షణమే స్పందించి సాయం చేసే గుణం నాది

  • తన తల్లిదండ్రులు అట్లాంటి పుట్టుకను ఇచ్చారని వివరించిన జగ్గారెడ్డి

  • తానిస్తున్న రూ.లక్షతో సోడా మెషిన్‌ తెచ్చుకొని వ్యాపారం బాగా చేయాలని జగ్గారెడ్డి సూచన

సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేటలో గురువారం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి(Jaggareddy) పర్యటించే సందర్భంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆయన కారుదిగి వెళ్తుండగా నిమ్మసోడా అమ్మే బండి కనిపించింది. అక్కడ ఆగి సోడా బండి నడుపుతున్న మహిళతో ముచ్చటిస్తూ వ్యాపారం గురించి ఆరా తీశారు. దీనికి ఆ మహిళ స్పందిస్తూ ఇప్పుడు ఏమీ మిగలడం లేదని.. కొత్త సోడా మెషిన్‌ కొంటే గిరాకీ పెరుగుతుందని చెప్పుకొచ్చింది.


jagga1.2.jpgఏదైనా సాయం చేస్తే బాగా నడుపుకుంటానని ఆ మహిళ అనడంతో.. ఎన్ని డబ్బులకు మెషిన్‌ వస్తుందని అనగా రూ.లక్ష దాకా ఖర్చవుతుందని చెప్పగా వెంటనే లక్ష రూపాయలు తీసి ఇచ్చారు. అడిగిన వెంటనే సాయం చేస్తున్నారా అని ఆ మహిళ ఆశ్చర్యపోగా.. తక్షణమే స్పందించే గుణం కలిగిన పుట్టుకను తన తల్లిదండ్రులు ఇచ్చారని.. ఇదంతా ఆ దేవుడు ఆదేశిస్తేనే జరిగిందని.. నీకు లక్ష సాయం అందిందని చెప్పి వెళ్లిపోయారు.


jagga1.3.jpgఈ వార్తలు కూడా చదవండి.

సినిమాలు తక్కువ.. గాసిప్స్‌ ఎక్కువ

భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2026 | 10:21 AM