Home » Telangana » Karimnagar
సుల్తానాబాద్ పట్టణంలో మంత్రుల పర్యటన కార్యక్రమం వాయిదా పడింది. సోమవారం మం త్రుల పర్యటనకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్ల పూర్త య్యాయి. అనివార్య కారణాల వల్ల ఈనెల 19కి వాయిదా పడిందని నాయకులు తెలిపారు.
మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అం డగా ఉంటుందని ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ గంధం సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివా రం స్థానిక ఏఐటీయూసీ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగ రేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార ణంగా బాధితులైన కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం ఏళ్ళ తరబడి పోరాటాలు చేస్తున్నట్టు తెలిపారు.
దశాబ్దాల కాలంగా సరైన ప్రయాణ వసతి లేక ఇబ్బందులు పడుతున్న రాయపేట గ్రామానికి, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి అబ్బిడిపల్లి, రాయపేట మీదుగా పందిళ్ల వరకు బీటి రహదారి నిర్మాణం పూర్తయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు.
శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఆది వారం గోదావరి ఖని బస్టాండ్ ప్రయాణికులతో కిట కిటలాడింది. సమయానికి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది.
రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగు తుందని, అర్హత గల ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంక్షేమ పండుగలా మార్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మందికి చేయూత కింద పింఛన్లు అందించనున్నా మని, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను మరికొన్ని కుటుం బాలకు వర్తింపజేస్తామన్నారు. శనివారం పెద్దపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో గల పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతా కాన్ని ఎగురవేశారు.
ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా.. జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పోలీస్‌పరేడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలని ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు.
సిరిసిల్ల, ఆగస్టు 15 (ఆంరఽధజ్యోతి): పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్య మని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నా రు.