Share News

ప్రజలు జీవనశైలి మార్చుకోవాలి

ABN , Publish Date - May 19 , 2026 | 12:06 AM

ప్రజలు జీవనశైలి మార్చుకోవాలని ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి రాజమౌళి అన్నారు. ప్రపంచ హైపర్‌ టెన్షన్‌ సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సోమవా రం రోగులకు అవగాహన కల్పించారు.

ప్రజలు జీవనశైలి మార్చుకోవాలి

కళ్యాణ్‌నగర్‌, మే 18(ఆంధ్రజ్యోతి): ప్రజలు జీవనశైలి మార్చుకోవాలని ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి రాజమౌళి అన్నారు. ప్రపంచ హైపర్‌ టెన్షన్‌ సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సోమవా రం రోగులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జీవనశైలి మార్పులు, వ్యాయామం లేకపోవడం, అధిక ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్‌ టెన్షన్‌(అధిక రక్తపోటు) సమస్య పెరుగుతుందన్నారు. దీంతో గుండెపోటు, పక్షవాతం, కిడ్ని వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్నారు. ప్రస్తుత జీవనశైలిలో మార్పులు రావాలని సూచిం చారు. హైపర్‌టెన్షన్‌కు చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించ కపోవచ్చని, అందుకే నిశ్శబ్ధ హంతుకుడు అని పిలుస్తారన్నారు. 30 సం వత్సరాల వయస్సు దాటిన తరువాత క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్ష చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. హైపర్‌టెన్షన్‌ నివారణకు రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని ఉప్పు, నూనె, జంక్‌, ఫుడ్‌ తగ్గించాలని పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని, ధూమ పానం, మధ్యపానం మానుకోవాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవా లన్నారు. ఆర్‌ఎంలు కృపాబాయి, దండె రాజు, మాణికేశ్వర్‌రెడ్డి, తిరుపతి, అనిత, స్వప్న, రజిత, పద్మతో పాటు ఎన్‌ఎంలు ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:06 AM