వేజ్‌బోర్డుకు వేళాయె
ABN , Publish Date - May 19 , 2026 | 12:11 AM
బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ఏర్పాటుకు కాలం సమీపి స్తోంది. జూలై 1 నుంచి 12వ వేజ్‌బోర్డు మొద లవుతుం ది. కానీ ఇప్పటికీ వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు. గతంలో ఒక వెజ్‌బోర్డు కాలం ముగిసే కంటే ఆరు నెలల ముందు నుంచే జాతీయ కార్మిక సం ఘాలను వెజ్‌బోర్డు నిర్మాణం కోసం నాయకుల పేర్లను ప్రతిపాదించమని కోరేది.
గోదావరిఖని, మే 18 (ఆంఽధ్రజ్యోతి): బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ఏర్పాటుకు కాలం సమీపి స్తోంది. జూలై 1 నుంచి 12వ వేజ్‌బోర్డు మొద లవుతుం ది. కానీ ఇప్పటికీ వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు. గతంలో ఒక వెజ్‌బోర్డు కాలం ముగిసే కంటే ఆరు నెలల ముందు నుంచే జాతీయ కార్మిక సం ఘాలను వెజ్‌బోర్డు నిర్మాణం కోసం నాయకుల పేర్లను ప్రతిపాదించమని కోరేది. నెల రోజుల్లో 11వ వేజ్‌బోర్డు ముగుస్తున్నప్పటికీ కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి కార్మిక సంఘాలకు ఎలాంటి పిలుపురాలేదు. దీనిపై జాతీయ కార్మిక సంఘాలు, బొగ్గు గని కార్మికులు ఆం దోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం వేజ్‌బోర్డు నిర్మాణంలో ముందుకు వెళుతుందేమోనని కార్మిక సం ఘాలు అంచనా వేస్తున్నాయి.
కోల్‌ఇండియాలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వ హించి గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో వేజ్‌బోర్డు విషయంలో చర్చించే అవకాశం ఉన్నది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల విషయంలో కూడా కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం కోల్ ఇండియాలోని ఎనిమిది బొగ్గు పరిశ్రమ ల్లో ఎన్నికలు నిర్వహించి 51 శాతానికి పైబడి కార్మికుల ఓట్లు సాధించిన సంఘాలతో బొగ్గు పరిశ్రమలు యాజ మాన్యాలు, కేంద్రం మంత్రిత్వశాఖ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అలా జరగని పక్షంలో20 శాతా నికి పైబడి ఓట్లు సాధించిన సంఘం నుంచి ఒక్కో ప్రతి నిధికి వేజ్‌బోర్డులో సభ్యత్వం కలిగిస్తారు. కానీ ఈ ప్రక్రి య అంతా సునాయాసంగా జరిగే అవకాశం లేదు. కోల్ ఇండియాలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేప థ్యంలో కోలిండియాలో ఎన్నికలు జరగడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ఏర్పాటు కు కమిటీ వేయకుండానే పే కమిషన్ ద్వారా జీత భత్యా లను నిర్ధారించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే వేజ్‌బోర్డులో కార్మిక సం ఘాల ప్రాతినిధ్యమే లేకుండా పే కమిషన్ ద్వారానే ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదు. సిమెంటు. స్టీలు తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇతర ప్రభుత్వ ఉద్యో గుల వేతనాల నిర్ధారణ పే కమిషన్ల ద్వారానే నడు స్తున్నది. అదే మాదిరిగా బొగ్గు గని కార్మికుల 12వ వేజ్‌బోర్డు విషయంలో కూడా పే కమిషన్ ఏర్పాటు చేసి వేతనాలను స్థిరీకరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కోల్ ఇండియాలోని ఎనిమిది బొగ్గు సంస్థలలో 2లక్షల 40 వేల మంది, సింగరేణిలో 40 వేల మంది కార్మికులు ఉన్నారు. పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలు, పని పరిస్థితులు, కార్మిక చట్టాలు. కార్మిక హక్కులు పరి గణలోకి తీసుకొని వేజ్‌బోర్డు నిర్మాణం జరగాల్సి ఉంది. కానీ లేబర్ కోడ్‌ల కారణంగా వేజ్‌బోర్డు విష యంలో ప్రతిష్టంబన నెలకొన్నది. 12వ వేజ్‌బోర్డు ఏర్పాటుకు కార్మికసంఘాల ప్రతినిధులను ఇప్పటికీ ఆహ్వానించక పోవడంపై నానారకాల ఊహాగానాలు వ్యక్తమవుతు న్నాయి. సింగరేణిలోని కార్మిక సంఘాలు వేజ్‌బోర్డు ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని వ్యతి రేకిస్తున్నాయి. వెంటనే 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పా టు చేయాలని అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి.