ధాన్యం కటింగ్‌పై ప్రభుత్వ విప్ ఆగ్రహం
ABN , Publish Date - May 19 , 2026 | 11:52 PM
మండల కేంద్రంలోని ఐకేపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కోతపై ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోతున్న రైతులకు కోత విధించిన ధాన్యాన్ని జమ చేయాలని ఏపీఎం సంపత్‌ను ఆదేశించారు. మంగళవారం కొల నూర్, ఓదెల, పొత్కపల్లి జీలకుంట లోని వరి, మక్క కొనుగోలు కేంద్రా లను సందర్శించారు.
ఓదెల, మే 19 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని ఐకేపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కోతపై ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోతున్న రైతులకు కోత విధించిన ధాన్యాన్ని జమ చేయాలని ఏపీఎం సంపత్‌ను ఆదేశించారు. మంగళవారం కొల నూర్, ఓదెల, పొత్కపల్లి జీలకుంట లోని వరి, మక్క కొనుగోలు కేంద్రా లను సందర్శించారు. ఓదెల ఐకేపి కేంద్రంలో రైతులు వంగ మొండయ్య, రామినేని రాజేంద్రప్రసాద్‌లకు చెందిన ఆరువందల బస్తాల్లో 10 బస్తాలు (నాలుగు క్వింటాళ్లు) ధాన్యం కోత విధించారని రైతులు ఎమ్మెల్యేకు వివ రించారు. కోత విధించిన ధాన్యాన్ని రైతులకు జమ చేయాలని ఏపిఎం సంపత్‌కు సూచించారు. అలాగే 41.500 గ్రాముల ధాన్యాన్ని తూకం వేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేకు తెలుపడంతో ఇకనుంచి ఎలాంటి తప్పి దం జరుగవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక తూకం వేస్తే చర్యలు తప్పవన్నారు. విలేకరులతో మాట్లాడుతూ రైతులు గోనె సంచులు కొను గోలు చేసుకోవాలని, ప్రభుత్వం సంచికి రూ.21 చెల్లిస్తుందన్నారు. లారీల కొరత ఉన్నందున వ్యాన్లు, ట్రాక్టర్లను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈనెల 27 వరకు మక్కల కొనుగోలు కేంద్రాల గడువు ముగుస్తుం దన్నారు. హమాలీల కొరత ఉన్నచోట రైతులు సహాయం అందించి త్వరగా ధాన్యాన్ని తరలించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు లేవని, కేవలం తెలంగాణలో మాత్రమే కొనుగోలు చేస్తున్నామన్నారు. పొత్కపల్లి మక్కజొన్న నిలువ చేస్తున్న గోదామును పరిశీలించారు. సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్‌రెడ్డి, అధికార ప్రతినిధి బైరి రవి గౌడ్, సర్పంచులు పల్లె కనకయ్య, అంబాల సారమ్మ, కొము రయ్య, నాయకులు రాహుల్, రెడ్డి రజనీకాంత్, ఆకుల మహేందర్, చింతం కుమారస్వామి,తీర్థాల వీరయ్య, నాగపురి రవి గౌడ్, ఢిల్లీ శంకర్, గుండేటి ఐలయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్, వంగ రాజమల్లు పాల్గొన్నారు.