Share News

రైతుల కష్టాలు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

ABN , Publish Date - May 19 , 2026 | 12:09 AM

తెలంగాణ రైతుల కష్టాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాటిని వివరించడంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విఫలమయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మలా ్లపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు.

రైతుల కష్టాలు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

ధర్మారం, మే 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతుల కష్టాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాటిని వివరించడంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విఫలమయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మలా ్లపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు పంటల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి మిల్లర్ల వద్ద నిల్వ చేసిందని, ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరించాల్సిన కేంద్రం పట్టించుకోక పోవడంతో మిల్లుల్లో నిలువలు పేరుకుపోయాయని దుయ్య బట్టారు. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ రైతుల కష్టాలు ఎం దుకు వివరించలేక పోయారని ప్రశ్నించారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లుల్లో అన్‌లోడ్‌ చేసే వరకు పూర్తి బాధ్యత అధికారులదే ఉం టుందని, రైతులను మిల్లర్ల వద్దకు పంపిస్తే సెంటర్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా మల్లాపూర్‌ నుంచి పెగడపల్లి మం డలం కీచులాటపల్లి వరకు రూ.11.21 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను మంత్రి అడ్లూరి పరిశీలించారు. రైతులు సహకరించాలని కోరారు. ఏఎంసీ చైర్మెన్‌ లావుడ్య రూప్లా నాయక్‌, వైస్‌ చైర్మెన్‌ అరిగె లింగయ్య, తహసీల్దార్‌ దురిశెట్టి శ్రీనివాస్‌, ఎంపీడీఓ వేముల సుమలత, మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, డీసీసీ సెక్రటరీ కొత్త నర్సింహులు, పత్తిపాక ప్యాక్స్‌ చైర్మెన్‌ నోముల వెంకట్‌రెడ్డి, యశోద అజయ్‌, గంధం మహిపాల్‌, మల్లయ్య పాల్గొన్నారు.

పారదర్శకంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ

సుల్తానాబాద్‌/జూలపల్లి/ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ళు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, చిన్నచిన్న విషయాలను రాద్దాంతం చేయడం తగదని ప్రభుత్వ విప్‌, ఎమ్మల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంట, జూలపల్లి మండల కేంద్రం, ఎలిగేడు మం డలం ధూళికట్టలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం పరిశీ లించారు. ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు చక్కగా జరుగుతున్నాయని, చిన్న విషయాలను పెద్దగా చూపుతూ రాజకీ యం చేయడం తగదన్నారు. ఎలాంటి కటింగ్‌లు లేకుండా చూస్తు న్నామన్నారు. కొందరు రైతులు సంచికి 42 కిలోలు కాంటా వేస్తున్నారని ఆయన దృష్టికి తేగా నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దిగు బడులు ఎక్కువగా వచ్చాయని, జిల్లా అధికార యంత్రాంగంతో రైస్‌ మిల్లర్లపై ఒత్తిడి తెచ్చి అన్‌లోడింగ్‌ చేయిస్తున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామ న్నారు. ప్రభుత్వం సేకరించిన మక్కలకు మార్కెటింగ్‌ లేకపోయినప్పటికినీ నష్టాన్ని భరిస్తూ ప్రభుత్వం ముందుకు వెలుతున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో క్వింటాలుకు పది కిలోల చొప్పున కటింగ్‌లు జరిగాయని, అప్పుడు నోరుమెదపని వారు ఇపుడు పారదర్శకంగా కొనుగోళ్లు జరుగు తున్నా రాద్దాంతం చేయడం తగదన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించారు. జూలపల్లి, ఎలిగేడు తహసీల్దార్‌ దత్తుప్రసాద్‌, యాకన్న, సుల్తానాబాద్‌, జూలపల్లి, ఎలిగేడు మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, కొమ్మ పోచాలు, పుల్లూరి వేణుగోపాల్‌రావు, సర్పంచ్‌ మారం కొమురయ్య, నాయకులు లోక జలపతిరెడ్డి, బొజ్జ శ్రీనివాస్‌,కందుకూరి అంజయ్య, కొమురయ్య, శంకర్‌, స్వామి, సామ రాజేశ్వర్‌రెడ్డి, దుగ్యాల సంతోష్‌ రావు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:09 AM