Home » Telangana » Karimnagar
పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని ట్రినిటి పాఠశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
వీఐపీ భద్రత విధుల్లో ఉన్న పీఎస్‌వో(పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) లు అప్రమత్తత, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో, పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా పేర్కొన్నారు.
వానాకాలం సాగులో భాగంగా హుజూరాబాద్ డివిజన్‌లో రైతులు 80శాతం వరకు వరినాట్లు పూర్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్ బి రాజ్ డిమాండ్ చేశారు.
నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ గౌస్ ఆలం అన్నారు.
అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నామని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని, ఇప్పటికే 22 వేల కోట్ల నిధులతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
రైతులు, నిర్వాసితులకు సం బంధించిన సమస్యలను పరిష్కరిస్తూ మంచిర్యాల-వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు సజావుగా కొనసాగేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు ఆటంకాలు లేకుండా అవ సరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐదుగురు మంత్రులు బుధవారం జిల్లాలో పర్యటించను న్నారు. సుల్తానాబాద్, మంథని వద్ద బహి రంగ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నా యి. రెండు నియోజకవర్గాల్లో సుమారు రూ. 387.32 కోట్ల విలువైన అభివృద్ధిపనులకు శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నా యి.
వాతావరణంలో మార్పులు సంభించడం, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది.
విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య అందిస్తూ నైపుణ్యాల అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావుఫూలే బాలికల డిగ్రీ కళాశాలను కలెక్టర్ సోమవారం పరిశీలిం చారు. కళాశాలలో ఏర్పాటు చేసిన చాం బర్ ఆఫ్ డ్రీమ్స్‌ను ప్రారంభించారు.