నేటి నుంచి మహాశివరాత్రి జాతర
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:52 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అను బంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శనివారం నుంచి ఈ నెల 16వరకు నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా విస్తృత ఏర్పా ట్లు చేశారు.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అను బంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శనివారం నుంచి ఈ నెల 16వరకు నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా విస్తృత ఏర్పా ట్లు చేశారు. శివరాత్రి సందర్భంగా వేము లవాడకు వచ్చే భక్తు లకు ఇబ్బందులు కలుగ కుండా సౌకర్యాలు కల్పించా రు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమేశ్వరాల యంలో భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రాజన్న సన్నిధిలో ధర్మగుం డం ఆధునికీకరిస్తున్న నేపథ్యంలో భక్తుల స్నానాలు చేసేందుకు వీలుగా పార్కింగ్ ప్రదేశంలో 400 షెవర్స్ నల్లాలు ఏర్పరిచి దుస్తులు మార్చేందుకు అవసరమైన తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులు రోజంతా జాగరణ చేసి తెల్లవారుజామున ఉపవాసాలు విరమిస్తారు. అనంతరం భీమేశ్వర స్వామివారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించి కోడె మొక్కు చెల్లించి ఎత్తు బెల్లం పంపిణీ చేసి టెం కాయలు కొట్టి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమ ర్పిస్తారు. ఇందుకోసం భీమేశ్వరాలయంతో పాటు బద్దిపోచమ్మ, ఇతర అనుబంధ ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు.
భక్తులకు సౌకర్యాలు
భక్తులకు ఇబ్బందుల లేకుండా స్వామి వారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రఽధానంగా ఆర్టీసీ బస్సులు, పోలీసు భద్ర త, తాగునీటి సౌకర్యం, వైద్య సౌకర్యం, పారి శుధ్యం, హెల్ప్ డెస్క్, పారిశుధ్య నిర్వహాణ, సైన్ బోర్డులు, తదితర ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని క్యూలైన్‌లలో తాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పిస్తు న్నారు. భక్తులకు అల్పాహారం, ఉప్మా, పులిహోర తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న రెండు కల్యాణ కట్టలు కాకుండా అదనంగా ఏర్పాటు చేశారు. వేములవాడ పట్టణంలో 48గంటల పాటు మద్యం విక్రయాలను బంద్ చేస్తున్నారు.
రాకపోకలకు 600 ఆర్టీసీ బస్సులు
కరీంనగర్ రిజీయన్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన 14 డిపోల నుంచి వేముల వాడకు 600 ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రూప కల్పన చేశారు. భక్తులను చేరవేసేందుకు తిప్పాపూర్ ప్రధాన బస్టాండ్‌తో పాటు చెరువు కట్టకింద తాత్కా ళిక బస్టాండ్ ఏర్పాటు చేశారు. బస్టాండ్ నుంచి భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పి స్తున్నారు. ఆర్టీసీ బస్సుల బస్టాండ్‌లలో విద్యు ద్దీపాలు, బారీ కేడ్లు, సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు.
24 గంటల పాటు వైద్య సేవలు
మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే 24గంటల పాటు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా అత్యవసర వైద్యసహాయం కోసం అంబులెన్స్‌లు, రెస్య్కూ టీం, వీల్‌చైర్స్, స్ర్టెచర్‌లు అందుబాటులో ఉంచారు. 30మంది డాక్టర్లు, 130 మంది పారా మెడికల్ సిబ్బంది సిద్దంగా ఉంచారు. పారిశుధ్య నిర్వహణకు వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల మున్సి పాలిటీ నుంచి సిబ్బందిని అందుబా టులో ఉంచారు. వీరే కాకుండా అదనంగా 400మంది లేబర్‌లను సిద్ధం చేశారు.
నిరంతర విద్యుత్ సరఫరా
మహాశివరాత్రి జాతరలో 24గంటలు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. వివిధ సబ్‌స్టేషన్‌ల నుంచి వేములవాడ దేవస్థానా నికి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా గత 15రోజులుగా ఫీడర్‌లను కలిపా రు. ఇందు కోసం 50మంది సెస్ సిబ్బంది అందుబా టులో ఉంచారు. దేవస్థానం పరిసరాల్లో అగ్నిప్రమా దాల నివారణకు 5 అగ్నిమాపక యంత్రాలు అందు బాటులో ఉంచారు.
రాజన్న సన్నిధిలో ఏకాంత పూజలు
మహాశివరాత్రి పర్వదినమున ఏకాంతంగా మహా లింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. భీమేశ్వరాల యంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధా నంగా శివదీక్షస్వాములు దీక్షలు విరమించేందుకు వీలుగా సిద్ధం చేశారు. వీరు స్వామివారిని దర్శిం చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేములవాడ పురప్రముఖులు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3గంటల వరకు అభిషేక దర్శనం చేసుకు నేందుకు సిద్ధం చేశారు.