ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉత్సవాలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:48 AM
వేములవాడలో శనివారం నుంచి ఈనెల 16వరకు మహాశివరాత్రి వేడుకలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేశామని ఇన్‌చార్జి కలెక్టర్ గరి మ అగ్రవాల్ అన్నారు.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వేములవాడలో శనివారం నుంచి ఈనెల 16వరకు మహాశివరాత్రి వేడుకలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేశామని ఇన్‌చార్జి కలెక్టర్ గరి మ అగ్రవాల్ అన్నారు. గురువారం రాత్రి వేములవాడ క్షేత్రంలో జాతర ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి. గీతే, ఎస్పీ రుత్విక్‌సాయి,అడిషనల్ కలెక్టర్ నగేష్‌లతో కలిసి జాతర గ్రౌండ్ పరిసరాలు, శివార్చన వేదిక, తాత్కాలిక టాయిలెట్లు, చలువ పందిళ్లు, జలప్రసాదం పంపిణీ కేం ద్రాలు, క్యూలైన్‌లు, సూచిక బోర్డులు, షవర్స్, కమాండ్‌కంట్రోల్ రూం తదిత ర ఏర్పాట్లను ఆమె పరిశీలించి సం బంధిత అధికారులకు పలు సూచన లు చేశారు. భక్తులకు అందిస్తున్న మౌళిక సదుపాయాలపై ఆరా తీసి అవసరమైన చోట్ల తక్షణమే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని, అధికా రులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సూడాల ని ఆమె స్పష్టం చేశారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వ హణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె ఆదేశించా రు. షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది ఉండాలని, తాగునీరు సరఫరా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు నిరం తరంగా అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. మహాశివరాత్రి జాతరను విజయ వంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతా యుతంగా పనిచేయాలని ఆమె కోరారు. ఇందులో ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈవో రామాదేవి, డీఆర్డీవో గీత, ఈఈలు నర్సింహాచారి, రాజేష్, సుధర్శన్‌రెడ్డి, అన్వర్, సుమలత, సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం, తహాసీల్దార్ జయంత్‌లు పాల్గొన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన
భీమేశ్వరసదన్‌లో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ మహేష్ బి. గీతే పరిశీలించారు. గురువారం పట్టణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆలయ పరిస రాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికా రులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.
కాగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు స్వామి వారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈ వో రమాదేవి తెలిపారు. మహాశివరాత్రి జాతర సంద ర్భంగా భీమేశ్వరాలయం, కేదారేశ్వరాలయం, బద్దిపోచ మ్మ ఆలయాల్లో గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.