Share News

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:25 AM

నర్సా పూర్‌లో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలం గాణ గ్రామీణ బ్యాంకు నర్సాపూర్‌ శాఖ ఆధ్వ ర్యంలో సదస్సులో బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సైబర్‌ క్రైమ్‌ మోసాలపై వివరించారు.

ఆర్థిక అక్షరాస్యతపై  అవగాహన

ఎలిగేడు, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): నర్సా పూర్‌లో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలం గాణ గ్రామీణ బ్యాంకు నర్సాపూర్‌ శాఖ ఆధ్వ ర్యంలో సదస్సులో బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సైబర్‌ క్రైమ్‌ మోసాలపై వివరించారు. అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, సందేహాలు, లింకులు, ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరితో పంచుకోవద్దని హెచ్చరించారు. డిజిటల్‌ లావాదేవీలు నిర్వ హించే సమయంలో అప్రమత్తంగా ఉండాల న్నారు. ఎలాంటి సందేహాలు, లావాదేవీలు ఉన్నా నేరుగా బ్యాంకు అధికారులను సంప్ర దించి అనుమానాలు నివృత్తి చేసుకోవాల న్నారు. బ్యాంకు మేనేజర్‌ శ్రీవాణి, సీఎఫ్‌ఎల్‌ జ్యోతి, గ్రామ వీఓఏ సునీత పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:25 AM