Share News

బీఆర్‌ఎస్‌ మెజార్టీ అభ్యర్థుల గెలుపు కాంగ్రెస్‌కు చెంపపెట్టు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:47 AM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన, దౌర్జన్యాలకు పాల్పడిన సిరిసిల్ల పట్టణ ప్రజలు బీఆర్‌ఎస్‌ మెజార్టీ అభ్యర్థులను గెలిపించడం కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టు అని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

బీఆర్‌ఎస్‌ మెజార్టీ అభ్యర్థుల గెలుపు కాంగ్రెస్‌కు చెంపపెట్టు

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన, దౌర్జన్యాలకు పాల్పడిన సిరిసిల్ల పట్టణ ప్రజలు బీఆర్‌ఎస్‌ మెజార్టీ అభ్యర్థులను గెలిపించడం కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టు అని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్‌లో విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో సిరిసిల్ల ప్రజలు మరోపారి మున్సిపల్‌ కార్యా లయంపై గులాబీ జెండాను ఎగరవేశారని అన్నారు. మున్సిపల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను మెజార్టీ అభ్యర్థులను గెలిపించి బీఆర్‌ఎస్‌ పార్టీకి మూడోసారి పట్టం కట్టారని అన్నారు. సిరిసిల్ల నియోజకవ ర్గం బీఆర్‌ఎస్‌ పార్టీకి అడ్డా అని కేటీఆర్‌ నాయకత్వంలో ఆయన వెంటే ఉంటామని ప్రజలు గెలిపించారన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ లో 27 స్థానాలను గెలుచుకొని మొత్తం పోలైన ఓట్లలో 52 శాతాని కిపైగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఓట్లు సాధించి తిరుగులేని విజయాన్ని సాధించిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కేసీఆర్‌ చేపట్టిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మరిచి పోకుండా మళ్లీ బీఆర్‌ఎస్‌కే ఓటు వేశారన్నారు. రెండు సంవత్సరాల సంక్షోభాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మొఖం మీద కొట్టినట్టుగా ప్రజలు తీర్పునిచ్చారని ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించకుంటే ఆర్డర్లు ఇవ్వమని ప్రభుత్వ పరం గా మద్దతునివ్వమని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పిన ఆ నాయకుల మొఖంపై కొట్టినట్లు తీర్పునిచ్చారని అన్నారు. కేటీఆర్‌ మద్దతునిచ్చిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను సిరిసిల్ల ప్రజలు విశ్వాసంతో గెలిపించారని రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో లేకున్న పట్టణంలోని వార్డులను అభివృద్ధి చేస్తారని అన్నారు. బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల సమన్వయకర్త తుల ఉమ మా ట్లాడారు. సేవ చేసే వారినే సిరిసిల్ల ప్రజలు గుర్తించారన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి సంక్షేమ పథాకాలను చూసి బీఆర్‌ ఎస్‌నే గెలిపించుకుంటామనే పద్ధతిలో సిరిసిల్ల ప్రజలు ఆ చైత న్యాన్ని కనబరచారన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌లో 39 వార్డులకు 27 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలిచిన సిరిసిల్ల పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీపై మరింత బాధ్యతలను పెట్టారని కేటీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖచ్చి తంగా పనులు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరకావాలని అన్నారు. అనంతరం తెలంగాణ భవనం ఎదుట బీఆర్‌ఎస్‌ కౌన్సిల ర్లు, నాయకులు, కార్యకర్తలు నృత్యాల చేసి టపాసులు కాల్చి సంబ రాలు జరుపుకున్నారు. అనంతరం గెలిచిన 27 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను బీఆర్‌ఎస్‌ నాయకత్వం రెండు బస్సులలో హైదరాబాద్‌ క్యాంప్‌నకు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామా రావు, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జిందం కళా, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, జిల్లా నాయకులు బొల్లి రామ్మోహన్‌, సత్తార్‌, గెలిచిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:47 AM