Share News

వైభవంగా ఓదెల మల్లికార్జున స్వామి కల్యాణం

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:23 AM

ఓదెల శైవక్షేత్రంలో శుక్రవారం బ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఆలయంలో అర్చకులు ఉదయం పూజలు నిర్వహించిన తర్వాత నూతన వధూవరులు భ్రమ రాంబ మల్లికార్జునస్వామిని కల్యాణ వేదికపై ఆసీనులు చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవ మూర్తులకు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

వైభవంగా ఓదెల మల్లికార్జున స్వామి కల్యాణం

ఓదెల, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఓదెల శైవక్షేత్రంలో శుక్రవారం బ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఆలయంలో అర్చకులు ఉదయం పూజలు నిర్వహించిన తర్వాత నూతన వధూవరులు భ్రమ రాంబ మల్లికార్జునస్వామిని కల్యాణ వేదికపై ఆసీనులు చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవ మూర్తులకు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అంతకు ముందు వీరిని ఆలయ ఈవో సదయ్య, చైర్మన్‌ చీకట్ల మొండయ్య, సభ్యులు, ఆలయ అర్చకు లు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కళ్యాణానికి ముఖ్యఅతిథిగా కాశీజ్ఞాన సింహాసన శాఖ కమల స్వామి మఠం నుంచి వేదాంత ఆచార్య గురు సిద్ధ మణికంఠ శివాచార్య స్వామి హాజరై భక్తి ప్రవచనాలను బోధించారు. వేద పండితుల మంత్రో చ్ఛరణతో కల్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేద పండితులు మహంతి, భువనేశ్వర్‌, జ్ఞానేశ్వర్‌, అర్చకులు భవాని ప్రసాద్‌, గంగాధర్‌, పంచా క్షరి,ఫణిధర్‌,అక్షిత్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ దాసరి వేణు భక్తులు పాల్గొన్నారు.

ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి

లోక కల్యాణం కోసం ప్రతి ఒక్కరూ ధర్మ పరి రక్షణ కోసం కృషి చేయాలని వేదాంత ఆచార్య గురు సిద్ధ మణికంఠ శివచార్యస్వామి అన్నారు. శుక్రవారం మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి విచ్చేసి మాట్లాడారు. ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం వెలుగొందు తుందని తెలిపారు. అలాగే మల్లికార్జునస్వామి సచ్చి దానంద స్వరూపునిగా భక్తులకు దర్శనం ఇవ్వడం ఇక్కడ అపురూపంగా భావిస్తున్నారని తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 12:23 AM