మెరుగైన వైద్యసేవలు అందించండి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:21 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిం చాలని, వైద్యులు సమయపాలన పాటించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్ర వారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిం చాలని, వైద్యులు సమయపాలన పాటించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్ర వారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో పాత బ్లాక్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను వేగవంతం చేయాలని, ఆసుపత్రికి వచ్చే రోగులు వారి అటెండెర్లకు కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు మందుల కొరత లేకుండా చూడాలని, డ్రగ్స్ నిల్వ కోసం ర్యాక్‌లను ఏర్పాటు చేయాలని ఆసుపత్రిలో దుమ్ము లేవకుండా సీసీరోడ్లు నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌ఎంలు దండె రాజు, కృపాబాయ్, అరుణ ఉన్నారు.