కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లలో వంతెనలు, అండర్‌పా్‌సల రద్దు.. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ఖర్చు పోనూ మొత్తం రూ.1,200 కోట్ల ప్రజాధనం ఆదా అవుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
రాష్ట్ర సచివాలయానికి మంచి నీటి క్యాన్ల సరఫరా నిలిచిపోయింది. పలు శాఖలకు, మంత్రులు, అధికారుల పేషీలకు మంచి నీళ్లు అందక అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
మీకే జవాబుదారీతనం లేకపోతే ఎలా? అని బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన మధుకర్ పార్టీ రాష్ట్ర పదాధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
లంచం తీసుకుంటూ ఇద్దరు మహిళా అధికారులు సోమవారం ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.
విద్యుత్ వినియోగదారుల నుంచి ట్రూ-అప్ చార్జీల రూపంలో రూ.7,635కోట్లు వసూలు చేసుకోవడానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) డిస్కమ్‌లకు అనుమతినిచ్చింది.
విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారాన్ని తెలంగాణ ప్రభుత్వం మోపింది. నవంబర్ కరెంట్ బిల్లుల నుంచే ట్రూ-అప్ వసూలు చేయనుంది.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
ఓటర్ల పేర్ల తొలగింపు, అభ్యంతరాల కోసం ఉద్దేశించిన ఫామ్-7లో భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే వాటిలో కొన్ని నకిలీవని ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రామప్ప దేవాలయానికి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు ప్రతిపాదనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలు, బ్లాస్టింగ్స్‌తో రామప్ప దేవాలయం, రామప్ప చెరువుకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాన్యుడిపై పెను భారం పడుతోందన్నారు.