బావి @ 180 ఏళ్లు
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:55 AM
హైదరాబాద్ లో ఓ బావికి 180 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. కోకాపేటలో ఎప్పుడో పురాతన కాలంలో దీన్ని తవ్వారని సమాచారం. కాగా.. ఈ ఒక్క బావేగాక పురాతన బావులు మొత్తం మూడు ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
కోకాపేటలో గోల్డెన్ మైల్ లేఅవుట్ మధ్యలో..
గోశాలలో మరో మూడు..
ఇప్పటికీ చెక్కు చెదరని వైనం
హైదరాబాద్ సిటీ: కోకాపేటలో ఆకాశహార్మ్యాలు నిర్మిస్తున్నా.. బావి తన అస్తిత్వాన్ని కోల్పోలేదు. 180 ఏళ్లకు పైగా చరిత్రగల మెట్లబావి నడిరోడ్డుపై ఉన్నా దాని ఆనవాళ్లు చెదిరిపోలేదు. పర్యావరణవేత్తలు, వాననీటి సంరక్షణ ఉద్యమకారులు దాన్ని సంరక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఈ ఒక్క బావే కాదు గోశాలలో మరో మూడు బావులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. 50-60 అంతస్థుల భవనాలను నిర్మిస్తున్న కోకాపేటలో నీటికోసం పాట్లు పడుతున్న పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పరిస్థితిని గుర్తించిన స్వచ్ఛంద సంస్థలు గోశాలలో ఉన్న నాలుగు బావులను
సంరక్షిస్తున్నారు. ఇందులో ఒక బావి హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన గోల్డెన్ మైల్ లే అవుట్‌లో రోడ్డు మధ్యలో ఉంది. 14 ఏళ్ల నుంచి వర్షపు నీరు బావిలోకి చేరేలా ఏర్పాట్లు చేసి ఆ నీటిని గోవులకు వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో గోల్డెన్ మైల్ లేఅవుట్ రోడ్డు 4 వరసలతో ఉండాల్సిన చోట బావి కారణంగా రెండు వరసల రోడ్డుగా మారింది. ఇరువైపుల నుంచి వాహనాల రాకపోకలు పెరగడంతో బావిని సంరక్షిస్తూనే రోడ్డును 4 వరసల రహదారిగా మార్చేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

బావులను పరిరక్షించాలి
ఐదారేళ్ల నుంచి మెట్ల బావిని రక్షించే చర్యలు చేపట్టాం. దాని నిర్వహణ బాధ్యతలను గోశాల నిర్వాహకులకు అప్పగించాం. కోకాపేటలో ఉన్న నాలుగు బావుల్లో నీటిని అప్పట్లో వ్యవసాయానికి వినియోగించేవారు. పురాతన బావుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- కల్పనా రమేష్, ఫౌండర్, ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు
రూ. 2.83 కోట్లతో బావిపై నుంచి వంతెన
బావిని సంరక్షిస్తూనే దాని పై నుంచి వంతెన నిర్మించాలని నిర్ణయించారు. రూ. 2.83 కోట్ల బడ్జెట్ కేటాయించి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News