Share News

వీధి దీపాలు వెలిగించేందుకు ఈ ప్రభుత్వం వద్ద డబ్బులేవు: కేంద్ర మంత్రి

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:44 PM

వీధి దీపాలు వెలిగించేందుకు డబ్బులు లేని దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగస్థులకు ఇంకా 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

వీధి దీపాలు వెలిగించేందుకు ఈ ప్రభుత్వం వద్ద డబ్బులేవు: కేంద్ర మంత్రి
Central Minister Kishan Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 05: తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పన్నెండు ఏళ్లుగా తెలంగాణలో బానిస ప్రభుత్వాలు నడుపుతున్నారని విమర్శించారు. మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ పదేళ్లు బానిస పాలన చేస్తే.. కాంగ్రెస్ పార్టీ సైతం మజ్లిస్ ఓట్ల కోసం బానిస పాలన చేస్తుందంటూ మండిపడ్డారు. ప్రభుత్వ భూములను విక్రయించడం అభివృద్ధా? అంటూ ఈ రెండు పార్టీల నేతలను సూటిగా ప్రశ్నించారు. మద్యం, డ్రగ్స్‌తో కుటుంబాలు పతనం అవుతున్నా.. ఈ ప్రభుత్వానికి కావాల్సింది మాత్రం ఆర్థిక వనరులేనని కేంద్ర మంత్రి అన్నారు.


భూములు అమ్మాలి.. అప్పులు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. అవినీతి, దోపిడి ప్రభుత్వమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. వీధి దీపాలు వెలిగించేందుకు డబ్బులు లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని వ్యంగ్యంగా అన్నారు. పని చేసే పార్టీలకే ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఐదు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయంటూ కిషన్ రెడ్డి సోదాహరణగా వివరించారు. ఇదా ప్రజా ప్రభుత్వమా.. పని చేసే ప్రభుత్వమా? సమాధానం చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. పని చేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.


పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో అనేక విమానాశ్రయాలు ఉన్నాయని.. తెలంగాణలో ఎందుకు లేవని ఆయన రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గత పదేళ్లు ఏమీ చేశారంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం.. కాంగ్రెస్ పార్టీకి బంగారు బాతు అయిందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఇక్కడి నుంచే నగదు పంపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ మాత్రం ఇవ్వరన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.


ఆర్ఆర్ ట్యాక్స్‌తో వ్యాపారస్తులు భయపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలకు ఎంత నగదు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బల్లగుద్దీ మరి ప్రశ్నించారు. ఫిక్స్‌డ్ రేట్స్.. వన్ టైమ్ పేమెంట్‌ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కగా కొనసాగిస్తుందని విమర్శించారు. గత 26 నెలల్లో ఏమీ చేసిందో చెప్పాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ పీకారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాషలో అడుగుతున్నానన్నారు. బీఆర్ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

For More TG News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 04:42 PM