అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలోని కీర్తి టవర్స్‌లో విషాదం చోటు చేసుకుంది. లిప్టులో ఇరుక్కుని ఊపిరాడక ఐదేళ్ల హర్షవర్ధన్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చూపేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
తెలంగాణలో డిసెంబర్ 9వ తేదీ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నెలాఖరులోగా ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎస్ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తెలంగాణ జాగృతి సంస్థ అధినేత కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్ ముట్టడికి కల్వకుంట్ల కవితతోపాటు ఆ సంస్థ నాయకులు, హెచ్ఎంఎస్ నేతలు ప్రయత్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేశారు. కొందరి వల్లే పార్టీ ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు.
మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు.
వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో శివశంకర్ అవినీతికి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
భాగ్యనగరంలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
గోదావరి మిగులు జలాలపై ఎవరికీ హక్కు లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ పిలిచిన టెండర్లు రద్దు చేసినా మరొక పేరుతో ఏపీ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.