కేసీఆర్ ఫొటోకు అజారుద్దీన్ దండం పెట్టాలి: హరీష్ రావు
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:06 PM
తెలంగాణ మంత్రి అజారుద్దీన్‌పై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకుంటే.. ఆయన మంత్రి పదవి పోతుందని అన్నారు.
జహీరాబాద్, ఫిబ్రవరి 08: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(ఆదివారం) జహీరాబాద్ లో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) పర్యటించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. ఇంకో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి పోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హరీశ్ రావు మాట్లాడుతూ...'అజారుద్దీన్‌కి మంత్రి పదవి వచ్చి మూడు నెలలు అయ్యింది. కానీ ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఇంకో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్(Azaaruddin) మంత్రి పదవి పోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీలకు మంత్రి పదవి రాలేదని ప్రశ్నించాం. అలా మేం ప్రశ్నించినందు వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారు. కేసీఆర్ ఫొటోకు అజారుద్దీన్ దండం పెట్టాలి. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రేవంత్ నోరు కచర, ఆయన చేసే పనులు కచర. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు ఉంటే.. రేవంత్ కళ్లకు గంతలు ఉన్నాయి' అంటూ హరీశ్ రావు విమర్శించారు.
'రేవంత్ పాలన వీధి రౌడీలా ఉంది. ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. తెలంగాణ తెచ్చాడని కేసీఆర్ ను, ఇంగ్లీషు మాట్లాడతాడని కేటీఆర్‌ను, ఆయన కంటే పొడుగ్గా ఉన్నానని నన్ను రేవంత్ తిడుతున్నారు. నాకు ఒకటి కాదు వంద నోటీసులు ఇచ్చినా ప్రశ్నించడం ఆపను. కేసీఆర్(KCR), కేటీఆర్, హరీశ్ రావును తిడితే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావు. అలానే పేదల కడుపు నిండదు. రేవంత్ పిచ్చి మాటలు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలి. ఓటు అనే కొరడాతో ఎన్నికల్లో రేవంత్ కు బుద్ధి చెప్పాలి' అని ప్రజలకు హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎఫ్ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదంపై దుష్ప్రచారం: శిఖాగోయల్
మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు.. ఏ2గా నమోదు..