Share News

20వ అంతస్తు నుంచి దూకి.. యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:01 PM

ఇటీవల కాలంలో కొందరు యువతీ యువకులు డిప్రెషన్ కారణంగా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల క్రితం హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా అత్తాపూర్‌లో 20 అంతస్తుల భవనంపై నుంచి దూకి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 20వ అంతస్తు నుంచి దూకి.. యువకుడి ఆత్మహత్య
Hyderabad Crime

హైదరాబాద్, ఫిబ్రవరి 08: పెళ్లికాలేదనే మానసిక వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌(Hyderabad)లో చోటుచేసుకుంది. అత్తాపూర్ ప్రాంతంలో ప్రవీణ్ అనే 30 ఏళ్ల యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. పెళ్లి కాలేదని గతకొన్ని రోజులుగా ప్రవీణ్ డిప్రెషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం సమయంలో 20 అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


ఇదే తరహాలో ఇటీవల ఓ ఐటీ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి విజయలక్ష్మి (26) అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన సదరు యువతి రెండు రోజుల క్రితం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, మంగళవారం హుస్సేన్ సాగర్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. గత కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌(Depression Cases)తో బాధపడుతోందని పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ ఫొటో‌కు అజారుద్దీన్ దండం పెట్టాలి: హరీష్ రావు

మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు.. ఏ2గా నమోదు..

Updated Date - Feb 08 , 2026 | 06:41 PM