నషాముక్త్ భారత్ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరమని, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ విఫల నాయకుడని, ఆయన నాయకత్వం వహించిన ఎన్నికలన్నీ ఓటమి చవిచూశాయని ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయమే మరో నిదర్శనమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు.
పేదింటి ఆడపడుచు రుణం తీర్చుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.
జిల్లాలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. మరికొన్ని రోజులు చలితీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హస్టళ్లు, గురుకులాల్లో చలి తీవ్రతతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. సరిపడా వసతులు లేక అష్టకష్టాలు పడుతున్నారు.
తల సేమియా, సికిల్ సెల్‌తో బాధపడుతున్న పిల్లలకు పెన్షన్ మంజూరు చేయాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ అన్నారు.
ప్రతీ విద్యార్థి విషయాల వారీగా కనీస అభ్యసన సామర్థ్యాలతో పాటు డిజిటల్ సామర్థ్యాలను, 21వ శతాబ్దపు నైపుణ్యాలను సాధించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ సూచించారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే దరఖాస్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.
మండల కేంద్రంలోని కంకాలమ్మగుట్టపై నిర్వహించిన కంకాలమ్మ జాతరలో భక్తజనం పొటెత్తారు. దీంతో కౌటాల మండల కేంద్రమంతా జనసంద్రమైంది. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం కంకలమ్మ గుట్ట వైపే చేరుకోవడం కనిపించింది.
ఆరు గాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అరబెట్టుకోవటానికి వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.