మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:44 PM
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత తెలిపారు.
కుమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత తెలిపారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సము దాయంలో వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ అధికారుల మొదటి ర్యాండమైజేషన్ కార్యక్ర మాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలకు పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది 20 శాతం అదనపు సిబ్బందితో కలిసి 153 మంది పోలింగ్ అధికారులు, 146 మంది సహాయ పోలింగ్ అధికారులు, 285 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేశామని తెలిపారు. పోలిం గ్ విధుల నిర్వహణ కోసం మొదటి ర్యాండమైజేషన్ చేపట్టామని, పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంత కుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అన్నిజిల్లాల ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషన ర్లు గజానన్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్, బూత్ స్థాయి అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మంపై సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వ హించాలని తెలిపారు. ఓటరు జాబితా పై ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని సూచిం చారు. 2002 సంవత్సరం ఓటరు జాబి తాలో పేరు ఉండి 2025 పేరు లేని వారి కుటుంబ సభ్యులు, కూతుర్లు, కుమారుల పేర్లు 2025 జాబితాలో ఉంటే మ్యాపింగ్ చేయాలని తెలిపారు. బూత్‌స్థాయి అధికారులు తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతీఇం టిని సందర్శించాలని బీఎల్‌వో, సూపర్‌వైజర్లు, తహసీ ల్దార్ పర్యవేక్షించాలని, సమగ్ర సవరణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల ను పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. మండలా ల వారీగా సమీక్ష నిర్వహించారు. అనంతరం భూభార తి, రెవెన్యూ సదస్సులు, సాదా బైనామాలపై సమీక్షిం చారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.