Share News

బాధితులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:48 PM

జిల్లాలోని మహిళలు, యువ తులు, బాలికలు హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు.

బాధితులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి
మాట్లాడుతున్న ఎస్పీ నితికాపంత్‌

- ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మహిళలు, యువ తులు, బాలికలు హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాలలు, పాఠశాలల విద్యార్థిను లకు ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, ఫోక్సో, షీ టీం, యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించారు. జిల్లాలో జనవరి నెలలో షీ టీం ద్వారా 83 హాట్‌స్పాట్‌లను గుర్తించి 24 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలి పారు. ఇందులో మొత్తం 11 ఫిర్యాదులు రాగా మూడు కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యాయి. ఏడు రెడ్‌హ్యాండెడ్‌ ఫిర్యాదులు రాగా ఒక ఫిర్యాదు లో కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు షీ టీంలు పని చే స్తున్నాయని ఆసిఫాబాద్‌(8712670564), కాగజ్‌నగర్‌ (8712670565) లలో సంప్రదించాలని, డయల్‌ 100కు సమాచారం అందించాలన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:48 PM