Share News

అధికారులు కదిలివచ్చారు..

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:28 PM

మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పాటి, బోగంపల్లిలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, మండల అభివృ ద్ధి అధికారి అబ్దుల్‌ హై బుధవారం సందర్శించారు.

అధికారులు కదిలివచ్చారు..
గ్రామస్థులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్న డీఆర్‌డీవో, ఎంపీడీవో

- గిరిజన గ్రామాలను సందర్శించిన డీఆర్‌డీవో

నెన్నెల, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పాటి, బోగంపల్లిలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, మండల అభివృ ద్ధి అధికారి అబ్దుల్‌ హై బుధవారం సందర్శించారు. అక్కడి ప్రజలు ఈనెల 2న కలెక్టర్‌ను కలిసి తమ గ్రామాలకు రోడ్లు వేసి బాధలు తీర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గిరివికాస్‌ బోర్లకు కరెంటు కనెక్షన్లు, సాగులో ఉన్నవారికి పోడు పట్టాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు. స్పందించిన కలెక్టర్‌ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని డీఆర్‌డీవో కిషన్‌ను పంపించారు. రోడ్డులేక ఆదివాసీలు పడుతున్న అవస్థలను అఽధికారు లు కళ్లారా చూశారు. వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో మాట్లాడుతూ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి నిధుల మంజూరు, గిరి వికాస్‌ బోర్లకు కరెంటు కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామి పనుల్లో హాజరుశాతం పెంచా లని సూచించారు. ఈజీఎస్‌లో గ్రామానికి అవసరమైన అన్నిపనులు చేసుకోవచ్చన్నారు. దీంతో పల్లెలు అభివృ ద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తుంద ని తెలిపారు. మన్నెగూడం సర్పంచ్‌ బానోత్‌ మధూకర్‌, ఏపీవో నరేష్‌, ఈసీ స్వామి, టీఏ కళ్యాణ్‌, ఎఫ్‌ఏ చీకటి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:28 PM